మాక్ మెక్ గ్రాత్ ఎవడో తెలియదు..హేజిల్ గాడ్ మాత్రమే తెలుసు అంటున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. మరి ఆ రేంజ్ లో నిన్న ఆర్సీబీ అభిమానులను సంతోషపెట్టాడు జోష్ హేజిల్ వుడ్. 19వ ఓవర్ బౌలింగ్ చేయటానికి హేజిల్ వుడ్ వచ్చేప్పటికి సమీకరణం 12 బంతుల్లో 18 పరుగులు. అంతకు ముందు ఓవర్లో ధ్రువ్ జురెల్, శుభమ్ దూబే కలిసి భువనేశ్వర్ ను ఓ ఆటాడుకుని 22 పరుగులు రాబట్టడంతో..ఆ ఏముంది మ్యాచ్ రాజస్థాన్ దే. ఆర్సీబీ హోం గ్రౌండ్ లో మళ్లీ మ్యాచ్ ఓడిపోతుంది అనుకున్నారు ఆర్సీబీ అభిమానులు. కానీ హేజిల్ వుడ్ అద్భుతమే చేశాడు. అంత క్రూషియల్ ఓవర్ లో ఒక్కటంటే ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి ప్రమాదకరమైన జురెల్ తో పాటు ఆర్చర్ వికెట్ కూడా తీసుకున్నాడు హేజిల్ వుడ్. ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీయటంతో పాటు నెక్ట్స్ ఉన్నది తక్కువ స్కోరే అయినా కొట్టడానికి సరైన హిట్టరే లేకుండా చేశాడు హేజిల్ వుడ్. అంతకు ముందు కూడా అంతే. తనను టార్గెట్ చేసి రెచ్చిపోయి వరుస బౌండరీలతో తనపై విరుచుకుపడుతున్న జైశ్వాల్ ను అవుట్ చేసి ఇన్నింగ్స్ ను స్టెబిలైజ్ చేశాడు హేజిల్ వుడ్. మొదటి రెండు పరుగులు ధారాళంగా సమర్పించుకున్న... తర్వాత 17వఓవర్ బౌలింగ్ చేసి ఆరు పరుగులు మాత్రమే ప్రమాదకర హెట్మెయర్ ను అవుట్ చేశాడు. మళ్లీ తన చివరి వర్ అంటే 19వ ఓవర్ లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు..మొత్తంగా 4 ఓవర్లలో 33పరుగులు ఇచ్చినా 4 కీలక వికెట్లు తీసి...మ్యాచ్ ను తీసుకువచ్చి ఆర్సీబీ చేతుల్లో పెట్టాడు హేజిల్ వుడ్. అందుకే కొహ్లీ నిన్న మ్యాచ్ గెలవగానే అందరినీ వదిలేసి ఎక్కడో దూరంగా ఉన్న హేజిల్ వుడ్ వరకూ పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ హగ్ చేసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు హేజిల్ వుడ్ కే దక్కింది.